పోలీసులకు ఫిర్యాదు చేశాడని కాల్చి చంపారు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దారుణం జరిగింది. నౌజర్‌పుర్‌ గ్రామానికి చెందిన ఓ రైతును అతడి పొలంలోనే కొందరు దుండగులు కాల్చి చంపారు. తన కుమార్తెను వేధించారని ఫిర్యాదు చేసిన రైతుపై కక్ష పెంచుకున్న కొందరు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు....

Updated : 22 Dec 2022 17:19 IST

ఆగ్రహం వ్యక్తం చేసిన యోగి ఆదిత్యనాథ్‌

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దారుణం జరిగింది. నౌజర్‌పుర్‌ గ్రామానికి చెందిన ఓ రైతును అతడి పొలంలోనే కొందరు దుండగులు కాల్చి చంపారు. తన కుమార్తెను వేధించారని ఫిర్యాదు చేసిన రైతుపై కక్ష పెంచుకున్న కొందరు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. రైతుపై ఏడుగురు వ్యక్తులు దాడి చేసినట్లు అతడి కుటుంబసభ్యులు ఆరోపించారు. గౌరవ్‌శర్మ అనే వ్యక్తితోపాటు మరికొందరు తన కుమార్తెను వేధిస్తున్నారని పేర్కొంటూ రైతు అమ్రిశ్‌ కుమార్‌ వర్మ (48) 2018లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు వెనక్కి తీసుకోవాలంటూ గౌరవ్‌శర్మ సహా మిగతావారు రైతును బెదిరించారు. అయినప్పటికీ అమ్రిశ్‌ కుమార్‌ వర్మ కేసు వెనక్కి తీసుకోలేదు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న దుండగులు రైతు పొలం వద్ద పనిచేస్తుండగా తుపాకులతో కాల్చి హత్య చేశారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను 24 గంటల్లోగా పట్టుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడైన గౌరవ్‌ శర్మ సహా మరో వ్యక్తిని అరెస్టు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని