Published : 06/11/2021 02:01 IST

Viral Video: టపాసులు పేలి తండ్రీకొడుకు మృతి.. వీడియో వైరల్‌!

చెన్నై: తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొట్టకుప్పంకు సమీపంలో టపాసులు పేలి తండ్రి సహా ఏడేళ్ల కుమారుడు అక్కడికక్కడే మరణించారు. పుదుచ్చేరి లోని అరియన్‌కుప్పం ప్రాంతానికి చెందిన కలయని సన్‌ తన ఏడేళ్ల కుమారుడితో తమిళనాడులోని మరక్కణంలో బాణాసంచా కొనుగోలు చేయడానికి వచ్చాడు. రెండు బ్యాగుల టపాసులు కొనుక్కొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు టపాసులు ఒక్కసారిగా పేలాయి. భారీ పేలుడు కారణంగా ఘటనా స్థలిలోనే తండ్రి, కుమారుడు మృతి చెందారు. రోడ్డుపై వారి వెనకాలే వెళ్తున్న మరో ఇద్దరికి కూడా పేలుడు దాటికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ లారీ సహా ఇతర వాహనాలు ఈ పేలుడు దాటికి పాక్షికంగా దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు. టపాసులు పేలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని