అంబులెన్స్‌ నిరాకరణ.. కుమార్తె మృతదేహంతో మోటార్‌ సైకిల్‌పై!

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్‌ నిరాకరించడంతో ఓ తండ్రి తన కుమార్తె మృతదేహాన్ని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్లాడు. ఈ ఘటనపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.

Updated : 17 May 2023 21:45 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్‌ నిరాకరించడంతో ఓ తండ్రి తన కుమార్తె మృతదేహాన్ని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

కోట గ్రామానికి చెందిన లక్ష్మణ్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె మాధురి (13)ని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రమైన షాడోల్‌లోని ఆస్పత్రిలో చేర్పించాడు. సోమవారం రాత్రి ఆ బాలిక మరణించింది. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని కోరగా.. అందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. 15 కి.మీల పరిధి దాటితే రావడం కుదరదని చెప్పారు. దీంతో సొంతంగా వాహనం ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేక మృతదేహాన్ని మోటర్‌సైకిల్‌పై తీసుకెళ్లేందుకు లక్మణ్‌ సింగ్ ఏర్పాటు చేశారు. అయితే, గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా షాడోల్‌ కలెక్టర్‌ వందనా వైద్య చూసి.. మృతదేహం తరలించేందుకు వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు