TS news: తండ్రి చావు... కుమార్తె వివాహం

కుమార్తె వివాహాన్ని ఘనంగా చేయాలని ఆ తండ్రి శుభలేఖలు పంచాడు. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. విధి వక్రీకరించడంతో అనారోగ్యం బారినపడి తనకుమార్తె వివాహాన్ని ఘనంగా చేయాలని ఆ తండ్రి శుభలేఖలు పంచాడు. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. విధి వక్రీకరించడంతో అనారోగ్యం బారినపడి తన

Updated : 03 Aug 2021 20:24 IST

బీర్కూర్: కుమార్తె వివాహాన్ని ఘనంగా చేయాలని ఆ తండ్రి శుభలేఖలు పంచాడు. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. విధి వక్రీకరించడంతో అనారోగ్యం బారినపడి తన కూతురి పెళ్లి కనులారా చూడకుండానే కన్నుమూశాడు. ఉదయం తండ్రి మరణించడం..  సాయంత్రం కుమార్తె వివాహం జరగడం వంటి అరుదైన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన షేక్‌ గూడ్‌సాబ్‌ (48) అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బతుకుదెరువు కోసం ఆయన కొన్నేళ్లు దుబాయి వెళ్లారు. కొంతకాలం తర్వాత స్వగ్రామానికి వచ్చి కిరాణ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. తన మూడో కుమార్తె తబషంకు సోమవారం పెళ్లి చేయాలని కొద్ది రోజుల కిందటే నిశ్చయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అకస్మాత్తుగా గూడ్‌సాబ్‌ శుక్రవారం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఈ ఉదయం మృతిచెందాడు. దీంతో పెళ్లి సజావుగా సాగిపోతుందని భావించి వచ్చిన బంధువులు మధ్యాహ్నం మృతుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తదితర కారణాలతో సాయంత్రం వివాహాన్ని జరిపించారు. చిన్న కుమారుడు దుబాయిలోనే ఉండడంతో తండ్రి కడచూపునకు నోచుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని