Crime News: భార్యపై అనుమానం.. కుమార్తెను చంపిన తండ్రి

భార్యపై అనుమానంతో కుమార్తెను తండ్రి చంపిన దారుణ ఘటన అనంతపురం జిల్లా నార్పలలో చోటుచేసుకుంది.

Updated : 22 Jun 2024 11:56 IST

నార్పల: భార్యపై అనుమానంతో కుమార్తెను తండ్రి చంపిన దారుణ ఘటన అనంతపురం జిల్లా నార్పలలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పావని(6) ఈ నెల 20వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదు. ఆమె తండ్రి గణేష్‌.. నార్పల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై రాజశేఖర్‌రెడ్డి,  సీఐ శ్రీధర్‌ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. శనివారం ఉదయం పోలీసులు గ్రామ శివార్లలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బాలిక తండ్రి ఓ వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. భార్యపై అనుమానంతో.. తన కుమార్తె కాదని బాలికను గొంతు నులిమి చంపి బావిలో పడేసినట్లు పోలీసుల విచారణంలో అతడు అంగీకరించాడు. పోలీసులు బాలిక మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు  తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని