Published : 10 Apr 2021 13:05 IST

థియేటర్‌లో వీరంగం.. నిలిచిపోయిన షో

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని శాంతి థియేటర్‌లో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. పట్టణానికి చెందిన సుమారు 50 మంది యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సినిమా తెరపై వాటర్‌బాటిళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో థియేటర్‌లోని సీట్లను చింపేశారు. అరగంట పాటు జరిగిన యువకుల గొడవతో వకీల్‌సాబ్‌ సినిమాను నిలిపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి యువకులను సముదాయించారు. అయితే చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ అభిమానుల మధ్య గొడవ జరిగినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. శుక్రవారం సెకెండ్‌ షో సినిమా సమయంలో ఈ ఘటన జరిగింది. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని