Fire Accident: ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం

నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 10 Jul 2024 21:09 IST

హైదరాబాద్‌: నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీదత్తసాయి కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల ధాటికి కాంప్లెక్స్‌ అద్దాలు పగిలి రోడ్డుపై పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిపమాక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమీపంలోని దుకాణాల వారిని ఖాళీ చేయించిన పోలీసులు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని