Hyderabad: అబిడ్స్ ట్రూప్ బజార్‌లో అగ్నిప్రమాదం.. 3 ఫైరింజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది
అబిడ్స్ ట్రూప్ బజార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్‌ఈడీ లైట్లు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
అబిడ్స్: హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ట్రూప్ బజార్ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫీర్డౌస్ మాల్‌లోని ఎల్‌ఈడీ లైట్లు విక్రయించే షో రూమ్ రెండో అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో పక్కన ఉన్న వ్యాపారులు భయబ్రాంతులకు గురైయ్యారు. వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
విద్యుత్ ఘాతంతోనే మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన షో రూమ్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. పైన అంతస్థులో ఓ మహిళా చిక్కుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది, స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులు ఆమెను సురక్షితంగా బయటకు తీసుకవచ్చారు. ప్రస్తుతానికి 3 ఫైరింజన్లతో సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur : మయన్మార్ సరిహద్దులో కొత్తగా 70కి.మీ మేర కంచె నిర్మాణానికి ప్రణాళిక : మణిపుర్ సీఎం
-
RBI: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా..
-
Congress: సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: మధుయాష్కీ
-
Hyderabad: పట్టుబడిన వాహనాల వేలం.. పోలీసుశాఖకు రూ.కోట్ల ఆదాయం
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి
-
Tirumala: తిరుమలలో వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం