Updated : 26 Aug 2020 15:00 IST

అనంతపురం ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

అనంతపురం: అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం ఆందోళన రేపింది. రాత్రి 12 గంటల సమయంలో కొవిడ్‌ వార్డులో ఉన్న రికార్డు రూమ్‌లో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. రికార్డు రూమ్‌ పక్కనే 24 మంది కొవిడ్‌ బాధితులు ఉన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్య, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, అనంతపురం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కొవిడ్‌ వార్డులోని బాధితులను మరో వార్డుకు తరలించామని అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్య, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, మంటలు వ్యాపించకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని