Fire Accident: అన్నవరం యూనియన్‌ బ్యాంక్‌లో భారీ అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం యూనియన్‌ బ్యాంకులో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగుతున్నాయి.

Updated : 24 Mar 2022 10:41 IST

అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాంక్ నుంచి పొగలు, మంటలు రావడం తో స్థానికులు బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బ్యాంక్‌లో మొత్తం పరికరాలు, సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే నగదు, పత్రాలు భద్రపరిచే లాకర్‌ సురక్షితంగా ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంతో బ్యాంకులో వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ తర్వాత నష్టంపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని