Hyderabad: సుల్తాన్‌బజార్‌లోని వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం

నగరంలోని సుల్తాన్‌ బజార్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుల్తాన్‌బజార్‌లోని ఓ వస్త్ర దుకాణంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..

Updated : 17 May 2022 18:26 IST

హైదరాబాద్: నగరంలోని సుల్తాన్‌ బజార్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుల్తాన్‌బజార్‌లోని ఓ వస్త్ర దుకాణంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో వస్త్ర దుకాణం పరిసరాల్లో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు. వస్త్ర దుకాణంలో షార్ట్‌ షర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని