Kamareddy: ఆపరేషన్ థియేటర్‌లో ఏసీ నుంచి మంటలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ప్రాంతీయాసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఏసీ నుంచి మంటలు వచ్చాయి.

బాన్సువాడ పట్టణం: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ప్రాంతీయాసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పారిశుద్ధ్య సిబ్బంది గదులను శుభ్రం చేస్తుండగా ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లోని ఏసీ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన నేపథ్యంలో పైఅంతస్తులో ఉన్న పలువురు రోగులను కిందికి తరలించామని.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్
-
World Culture Festival : మానసిక అనారోగ్యం అనేది అతి పెద్ద సమస్య : శ్రీశ్రీ రవిశంకర్
-
Vizag: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె.. అందులో ఏముందో?
-
Jaishankar: ఆధారాలుంటే చూపించండి.. చూస్తాం: కెనడాను కడిగేసిన జైశంకర్
-
Guntur: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం
-
Biden-Trump: బైడెన్‌కు దారి దొరకడం లేదు.. అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై ట్రంప్ ఎద్దేవా