Nellore: విద్యుదాఘాతంతో 13 ఇళ్లు దగ్ధం.. దివ్యాంగురాలు సజీవ దహనం

విద్యుదాఘాతంతో 13 ఇళ్లు పూర్తిగా దగ్ధమై ఒకరు సజీవ దహనమైన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. రంగనాయకులపేట బర్మాషెల్‌ గుంట ప్రాంతంలో గుడిసెలు ఏర్పాటు చేసుకుని కొందరు కూలీలు నివాసం ఉంటున్నారు.

Published : 21 Jun 2024 03:31 IST

 

అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఇళ్లు

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో 13 ఇళ్లు పూర్తిగా దగ్ధమై ఒకరు సజీవ దహనమైన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. రంగనాయకులపేట బర్మాషెల్‌ గుంట ప్రాంతంలో గుడిసెలు ఏర్పాటు చేసుకుని కొందరు కూలీలు నివాసం ఉంటున్నారు. గురువారం విద్యుదాఘాతంతో ఇళ్లలో ఉండే నాలుగు సిలిండర్లు పేలిపోయాయి. దీంతో మంటలు ఒక్కసారిగా ఇళ్లను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో దివ్యాంగురాలు నాగలక్ష్మి (40) సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. రూ.12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ.. మృతురాలి కుటుంబానికి రూ.50 వేలు, దగ్ధమైన ఇళ్లకు రూ.15వేల చొప్పున సొంత నిధులు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని