Crime news: చెప్పుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.50లక్షల ఆస్తి నష్టం

పురానీ హవేలీలోని ఎస్‌కే ఫుట్‌వేర్‌ షాప్‌లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Updated : 12 Jun 2024 19:54 IST

హైదరాబాద్‌: పురానీ హవేలీలోని ఎస్‌కే ఫుట్‌వేర్‌ షాప్‌లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 50లక్షల విలువ చేసే పాదరక్షలు, ముడిసరకు దగ్ధమైంది. సమాచారం అందగానే మీర్‌చౌక్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. చెప్పుల దుకాణం కావటంతో మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని