Hyderabad: రామంతపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

షార్ట్ సర్క్యూట్‌ కారణంగా రామంతపూర్‌లోని ప్లైవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో గోదాంలో మొత్తం సామగ్రి కాలి బూడిదైంది.

Published : 04 Feb 2023 09:50 IST

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్‌ పరిధిలో ఉన్న రామంతపూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రామంతపూర్‌లోని ఈజీ ప్లైవుడ్ గోదాంలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో గోదాంలో మొత్తం సామగ్రి కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని