Warangal: వరంగల్‌లోని ఫర్నిచర్‌ గోదాంలో అగ్నిప్రమాదం.. రూ.కోటి ఆస్తినష్టం

వరంగల్ ఇసుక అడ్డా కూడలిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Updated : 03 Feb 2023 10:01 IST

శివనగర్‌: వరంగల్ ఇసుక అడ్డా కూడలిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న పాత దర్వాజాలు, కిటికీలు విక్రయించే దుకాణాలకు చెందిన గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న ఒక ఫెర్టిలైజర్ షాపు, ఓ ద్విచక్ర వాహన రిపేర్ కేంద్రానికి మంటలు అంటుకున్నాయి. చుట్టుపక్కల ఉన్న నివాస గృహాలలోకి పొగ రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 

వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సుమారు 12 ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలు అదుపు చేస్తున్నారు. ఉదయం 8 గంటల వరకు కూడా పూర్తిస్థాయిలో మంటలు ఆర్పలేకపోయారు. సుమారు రూ.కోటి విలువైన ఫర్నిచర్ దగ్ధమైనట్లు వ్యాపారులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వరంగల్ ఏసిపి గిరి కుమార్ కలకోట తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని