Cairo: చర్చిలో ఘోర అగ్నిప్రమాదం.. 41మంది సజీవ దహనం

ఈజిప్టు రాజధాని కైరోలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కాప్టిక్‌ చర్చిలో ఆదివారం పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో 41మంది.....

Published : 14 Aug 2022 17:13 IST

కైరో: ఈజిప్టు రాజధాని కైరోలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కాప్టిక్‌ చర్చిలో ఆదివారం పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో 41మంది సజీవదహనమయ్యారు. మరో 14మంది గాయాలపాలైనట్టు అధికారులు వెల్లడించారు. ఇంబాబాలోని జనసాంద్రత కలిగిన పరిసరాల్లో ఉండే అబూ సెఫీన్‌ చర్చిలో ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియరానప్పటికీ.. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగినట్టు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు సమాచారం. మరోవైపు, ఈ ఘటనపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా సిసి విచారం వ్యక్తంచేశారు. కాప్టిక్‌ క్రిస్టియన్‌ చర్చి పోప్‌ తవాడ్రోస్‌‌-IIకి ఫోన్‌ చేసి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని