Published : 04 Feb 2022 02:00 IST

Asaduddin : ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై కాల్పులు

ఓ షూటర్‌ని అరెస్టు చేసిన యూపీ పోలీసులు

దిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిగాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తన వాహనంపై మూడు రౌండ్ల కాల్పులు జరిగినట్లు అసదుద్దీన్‌ వెల్లడించారు. సురక్షితంగా బయటపడిన ఆయన కాల్పుల ఘటన విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలిపారు. మేరఠ్ జిల్లా కితౌర్‌లో ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్‌ పాల్గొన్నారు. ప్రచారం అనంతరం దిల్లీకి వెళ్తుండగా ఛాజర్సీ టోల్‌ప్లాజా వద్ద కాల్పులు జరిగినట్లు అసదుద్దీన్‌ పేర్కొన్నారు. టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులు 3-4 రౌండ్లు కాల్పులు జరిపారన్నారు. షూటర్లు ఆయుధాలను అక్కడే వదిలేసి పరారయ్యారని పేర్కొన్నారు. కాల్పుల్లో తన కారు టైర్లు పంక్చర్‌ కావడంతో మరో వాహనంలో దిల్లీకి వెళ్లినట్టు అసదుద్దీన్‌ తెలిపారు. తామంతా సురక్షితంగా బయటపడినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు.

స్వతంత్ర దర్యాప్తు జరపాలి: ఒవైసీ

దిల్లీ చేరుకున్న అనంతరం అసదుద్దీన్‌ మీడియాతో మాట్లాడారు. తన కారుపై కాల్పుల ఘటనలో ఓ షూటర్‌ని అరెస్టు చేసి.. ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తనకు సమాచారం ఇచ్చారని అసదుద్దీన్‌ వెల్లడించారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్టు చెప్పారు. స్వతంత్ర దర్యాప్తు జరపడం ఉత్తర్‌ ప్రదేశ్‌, కేంద్ర ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలవనున్నట్టు తెలిపారు.

ఒకరి అరెస్టు.. మరొకరి కోసం గాలిస్తున్నాం: హాపూర్‌ ఎస్పీ

అసదుద్దీన్‌ కారుపై కాల్పుల ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు హాపూర్ ఎస్పీ దీపక్‌ భుకేర్‌ వెల్లడించారు. అతడి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. అతడితో పాటు ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడనీ.. ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌లు ఏమైనా ఉంటే మీడియాకు వెల్లడిస్తామన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.



Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని