Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్డులో కారులో మంటలు

తిరుమల ఘాట్‌ రోడ్డులో కారులో మంటలు చెలరేగాయి. తిరుమలకు వెళ్లే ఆఖరి మలుపు వద్ద ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించాయి. కర్నూలుకు

Updated : 19 Mar 2022 18:33 IST

తిరుమల: తిరుమల ఘాట్‌ రోడ్డులో కారులో మంటలు చెలరేగాయి. తిరుమలకు వెళ్లే ఆఖరి మలుపు వద్ద ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించాయి. కర్నూలుకు చెందిన భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు చూసిన భక్తులు వెంటనే కారులో నుంచి దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని