APSRTC: ఇంజిన్‌లో మంటలతో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెనుప్రమాదం

కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో నుంచి మంటలు రావడంతో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.

Updated : 21 Oct 2022 10:34 IST

పెదపారుపూడి: కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో నుంచి మంటలు రావడంతో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. గుడివాడ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో బస్సులో విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో కలిసి మొత్తం 60 మంది ఉన్నారు. ఇంజిన్‌ నుంచి మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్‌.. అప్రమత్తమై బస్సును నిలిపేశారు. వెంటనే ప్రయాణికులు, విద్యార్థులు కిందికి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

మంటలు చెలరేగిన నేపథ్యంలో బయటకు దిగే కంగారులో చాలా మంది తమ వస్తువులను బస్సులోనే వదిలేయడంతో అవన్నీ కాలి బూడిదయ్యాయి. బ్యాగుల్లో దాచుకున్న నగదు, బంగారం, దుస్తులు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని