Hyderbad: జూబ్లీహిల్స్‌లో అగ్ని ప్రమాదం

జూబ్లీహిల్స్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Updated : 25 Jun 2024 19:17 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నంబర్‌ వన్‌లోని సీవీఆర్‌ న్యూస్ ఛానల్ పక్కన ఉన్న భవనంలోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మొదటి ఆరు అంతస్తులను పార్కింగ్ నిమిత్తం వినియోగిస్తుండగా మిగిలిన అంతస్తుల్లో పలు సంస్థలు కొనసాగుతున్నాయి. నాలుగో అంతస్తులో మంటలు రావడంతో పైన ఉన్న ఉద్యోగులు అప్రమత్తమై కిందకు పరుగులు తీశారు. మంటల కారణంగా ఫర్నిచర్‌, తదితర సామగ్రి మంటల్లో దగ్ధమయ్యాయి. జూబ్లీహిల్స్, ఫిలింనగర్ అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తున్నామని అగ్నిమాపక అధికారి సాయినాథ్‌రెడ్డి తెలిపారు.

మరో ప్రమాదం

జూబ్లీహిల్స్‌లోని ఫ్యాబ్‌ ఇండియా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా దట్టంగా పొగ అలముకుంది. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది లోపల పనిచేస్తున్న వారిని బయటకు పంపించారు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని