Crime News: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు చోటుచేసుకున్నాయి. తెదేపా మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.

Updated : 02 Feb 2023 05:45 IST

పల్నాడు: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు చోటుచేసుకున్నాయి. తెదేపా మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడి పారిపోయారు. గాయాలపాలైన బాలకోటిరెడ్డిని కుటుంబసభ్యులు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితుడిని తెలుగుదేశం పార్టీ నేత చదలవాడ అరవిందబాబు ఆసుపత్రిలో పరామర్శించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు