Crime News: బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు

బిహార్‌లో తెలంగాణ పోలీసులపై సైబర్‌ నేరగాళ్లు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

Published : 14 Aug 2022 21:44 IST

హైదరాబాద్‌: బిహార్‌లో తెలంగాణ పోలీసులపై సైబర్‌ నేరగాళ్లు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. వాహన కంపెనీల ప్రాంఛైజీల పేరిట సైబర్‌ మోసాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు బిహార్‌ వెళ్లారు. నవాడా జిల్లాలోని భవానిబిగా గ్రామంలో నిందితుల ఆచూకీ గుర్తించారు. స్థానిక పోలీసుల సాయంతో నిందితులను పట్టుకునే క్రమంలో ప్రధాన నిందితుడు మితిలేష్ ప్రసాద్‌ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.22 కోట్ల నగదు, 3 కార్లు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకురానున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని