చిరుతను చంపి తిన్నారు..

కేరళలోని ఇడుక్కి జిల్లాలో చిరుతను వేటాడి.. వండుకుని తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 24 Jan 2021 12:13 IST

ఇడుక్కి: కేరళలోని ఇడుక్కి జిల్లాలో చిరుతను వేటాడి.. వండుకుని తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు చిరుత చర్మం, గోర్లు అమ్మకానికి పెట్టగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇడుక్కి శివారు గ్రామానికి చెందిన వినోద్‌ తన పొలంలోకి అటవీ జంతువులు రాకుండా ఉచ్చులు ఏర్పాటు చేశాడని పోలీసులు భావించారు. ఇంతకుముందు కూడా అనేక జంతువులను చంపినట్టు గుర్తించారు. ప్రస్తుత ఘటనలో సుమారు 50కేజీల బరువున్న చిరుత చిక్కగా.. వినోద్‌ అతని స్నేహితులు కలిసి దాన్ని వండుకొని తిన్నారని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు.  నిందితులు చిరుత చర్మం, పళ్లు, గోర్లను అమ్మకానికి పెట్టారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.

ఇవీ చదవండి..
మోసిమ్‌గాళ్లు..!

వెండిసింహాల చోరీ.. పాత నేరస్థుడి పనే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని