AP News: విషాదం.. మునేరులో గల్లంతైన ఐదుగురు విద్యార్థులూ చనిపోయారు

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు వద్ద మునేరులో ఈతకు దిగి గల్లంతైన విద్యార్థుల్లో

Updated : 11 Jan 2022 12:47 IST

చందర్లపాడు: కృష్ణా జిల్లాలో విద్యార్థుల గల్లంతు ఘటన విషాదాంతమైంది. చందర్లపాడు మండలం ఏటూరు వద్ద మునేరులో ఈతకు దిగి గల్లంతైన ఐదుగురు విద్యార్థులూ విగతజీవులుగా మారారు. ఏడో తరగతి చదువుతున్న మాగులూరి సన్నీ (12), కర్ల బాలయేసు (12), జెట్టి అజయ్‌ (12), ఆరో తరగతి విద్యార్థి మైలా రాకేష్‌ (11), తొమ్మిదో తరగతి విద్యార్థి గురజాల చరణ్‌ (14) గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం సోమవారం సాయంత్రం నుంచి గాలింపు కొనసాగించారు. మంగళవారం ఉదయం ఆ ఐదుగురి మృతదేహాలను గుర్తించి మునేరు నుంచి వెలికితీశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. ఈతకు వెళ్లిన పిల్లలు విగతజీవులగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

జరిగింది ఇదీ..

సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటివద్దే ఉంటున్న విద్యార్థుల్లో ఐదుగురు సోమవారం మునేరులో స్నానానికి వెళ్లారు. ఇంటి నుంచి సైకిళ్లపై మునేరువైపు వెళ్లారు. పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సరికి పిల్లలు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. విద్యార్థులు మునేరువైపు వెళ్లారని పశువుల కాపరి చెప్పడంతో అక్కడకు వెళ్లి చూసే సరికి దుస్తులు, సైకిళ్లు కనిపించాయి. పిల్లల ఆచూకీ లభించకపోవడంతో వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. సోమవారం సాయంత్రం నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. ఈరోజు ఉదయం గల్లంతైన విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు