Delivery Agent: ఫుడ్‌ డెలివరీకి వచ్చి.. యువతికి ముద్దు పెట్టాడు!

ఫుడ్‌ డెలివరీ కోసం వచ్చిన ఓ వ్యక్తి(Delivery Agent).. ఇంట్లోకి ప్రవేశించి యువతిని బలవంతంగా ముద్దు పెట్టుకున్న ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది.

Updated : 21 Sep 2022 00:01 IST

ముంబయి: ఫుడ్‌ డెలివరీ కోసం వచ్చిన ఓ వ్యక్తి(Delivery Agent).. ఇంట్లోకి ప్రవేశించి యువతిని బలవంతంగా ముద్దు పెట్టుకున్న ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అతడు‌.. ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. ‘ఓ 19 ఏళ్ల విద్యార్థిని ఇటీవల ఓ ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ యాప్‌లో ఆర్డర్‌ పెట్టారు. ఈ క్రమంలోనే రాత్రి 9.30కు ఆర్డర్‌తో సంబంధిత ఇంటికి చేరుకున్న రాయిస్‌ షేక్‌(39)‌.. నీళ్లు కావాలంటూ లోపలికి ప్రవేశించాడు. యువతి ఒంటరిగా ఉన్నట్లు గమనించి.. నీళ్లతో తిరిగి వచ్చిన ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. వెంటనే ఆ యువతి ప్రతిఘటించడంతో అక్కడినుంచి పారిపోయాడు. అనంతరం ‘నీకు అంకుల్‌ లాంటివాడిని’ అంటూ మెసేజ్‌లు పంపాడు’ అని పోలీసులు తెలిపారు.

ఓ స్నేహితుడి సాయంతో పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న యువతి.. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినట్లు పోలీస్‌ ఇన్‌ఛార్జి జగన్నాథ్‌ వెల్లడించారు. ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. అదే రాత్రి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై ఫుడ్‌ డెలివరీ సంస్థ స్పందిస్తూ.. సదరు యువతి ఆర్డర్‌ డెలివరీ బాధ్యతను వేరే సంస్థకు మార్చినట్లు తెలిపింది. దీంతో.. ఒక యాప్ నుంచి మరొక యాప్‌కి ఆర్డర్ చైన్‌ ఎలా మారిందనేదానిపైనా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు నగరవాసులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని