Andhra News: అనంతపురంలో మధ్యాహ్న భోజనం తిని 40మంది విద్యార్థులకు అస్వస్థత

అనంతపురం జిల్లా కక్కల్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు

Updated : 12 Mar 2022 10:00 IST

అనంతపురం గ్రామీణం: అనంతపురం జిల్లా కక్కల్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు కడుపునొప్పితో బాధపడుతుండటంతో.. గమనించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమచారం అందించారు. వారు వచ్చిన తర్వాత అంబులెన్సుల్లో విద్యార్థులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.మల్లేశ్వరి వెల్లడించారు. రేపటి వరకు విద్యార్థులను పర్యవేక్షణలో ఉంచుతామని సూపరింటెండెంట్‌ తెలిపారు.

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన డీఈఓ శామ్యూల్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని పిల్లల వార్డు వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులకు సర్దిచెప్పిన డీఈఓ.. ఈ ఘటనకు బాధ్యులైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను తొలగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని