Foot over bridge collapse: బల్లార్షాలో కూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. 13మందికి గాయాలు
మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రాపూర్‌లోని బల్లార్షా రైల్వేస్టేషన్లో ఫుట్ఓవర్ వంతెన కూలిపోయింది.
బల్లార్షా: మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రాపూర్‌లోని బల్లార్షా రైల్వేస్టేషన్లో ఫుట్ఓవర్ వంతెన కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో 13మందికి పైగా గాయాలు కాగా.. నలుగురికి తీవ్రగాయాలైనట్టు అధికారులు వెల్లడించారు. రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్‌ఫాం నుంచి వేరే ప్లాట్‌ఫాంకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఈ వంతెనపై నడుస్తుండగా అనేకమంది ప్రయాణికులు దాదాపు 20అడుగుల ఎత్తు నుంచి ట్రాక్‌పై జారిపడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పుణె రైలు ఎక్కేందుకు ఒక్కసారిగా ప్రయాణికులు ఫుట్ఓవర్ వంతెనను ఉపయోగించడంతో అకస్మాత్తుగా అది కిందకు వంగిపోయిందని అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్‌లోని 1 నంబర్ ప్లాట్‌ఫాం నుంచి 4వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వెళ్తున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అందుబాటులో ఉన్న వాహనాల్లోనే తోటి ప్రయాణికులు, ఐఆర్సీటీసీ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.
చంద్రాపూర్‌కు 12కి.మీల దూరంలోని బల్లార్షా జంక్షన్ రైల్వేస్టేషన్లో ఈ సాయంత్రం 5గంటలకు ప్రమాదం చోటచేసుకుందని రైల్వే అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు పుణె వెళ్లే రైలు ఎక్కేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించడంతో కొంత భాగం కిందకు వంగిపోయినట్టు తెలిపారు. మిగతా వంతెనంతా చెక్కు చెదరలేదన్నారు. దీని ఫలితంగా 20అడుగుల ఎత్తు నుంచి రైల్వేట్రాక్‌పై కొందరు జారిపడిపోయారని వివరించారు. 13మందికి గాయాలు కాగా.. వారిని బల్లార్పూర్ రూరల్ ఆస్పత్రికి తరలించామన్నారు. వీరిలో కొందరిని చంద్రాపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని చంద్రాపూర్ జిల్లా కలెక్టర్ వినయ్ గౌడ వివరించారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్యం సహాయం అందించాలని చంద్రాపూర్ గార్డియన్ మంత్రి సుధీర్ మునంటివార్ వైద్య సిబ్బందికి ఆదేశించారు. అలాగే, ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం