
Crime News: కుమారుడి క్యాన్సర్ చికిత్స కోసం దొంగతనాలు చేస్తున్న మాజీ పోలీస్ అరెస్ట్
బెంగళూరు: క్యాన్సర్‌తో బాధపడుతున్న తన కుమారుడికి చికిత్స చేయించేందుకు దొంగగా మారిన ఓ మాజీ పోలీసుని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తిని కేరళకు చెందిన నజీర్ అహ్మద్ ఇమ్రాన్ (61)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. నజీర్ భారత్‌కు రాకముందు 9 ఏళ్ల పాటు బహ్రెయిన్‌లో పోలీసుగా పనిచేశాడు. ఈ క్రమంలో అతడి కుమారుడు క్యాన్సర్ బారిన పడ్డాడు. దీంతో కుమారుడికి క్యాన్సర్ చికిత్సకు డబ్బును సమకూర్చడం కోసం కార్లను చోరీ చేయడం మొదలెట్టాడు. నకిలీ పత్రాలు సృష్టించి దొంగిలించిన కార్లను విక్రయించేవాడు. 2008లోనే నజీర్ ఓ సారి అరెస్టయి జైలుపాలయ్యాడు. బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తీరు మార్చుకోకుండా చోరీలు కొనసాగిస్తున్నాడు.
సర్వీస్ సెంటర్ నుంచి ఎస్‌యూవీని దొంగిలించాడని ఫిర్యాదు అందడంతో నజీర్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడి చికిత్స కోసమే ఈ నేరాలకు పాల్పడినట్లు నజీర్ విచారణలో అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. బెంగళూరు, కేరళలోని పలు ప్రాంతాల్లో వాహనాల దొంగతనాల్లో నజీర్ హస్తం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Election Commission: పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం మాకివ్వండి: ఈసీ
-
World News
Ukraine Crisis: జీ-7 సదస్సు వేళ.. కీవ్‌పై విరుచుకుపడిన రష్యా!
-
Politics News
AAP: ఆప్‌కు చుక్కెదురు! సీఎం మాన్ ఖాళీ చేసిన ఎంపీ స్థానంలో ఓటమి
-
Crime News
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Movies News
Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్‌లో ఆప్‌కు భంగపాటు
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- అక్కడి మహిళలు ఆ ఒక్క రోజే స్నానం చేస్తారట!
- Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!
- Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు