TSPSC: పేపర్ లీకేజీ కేసు.. మరో నలుగురు అరెస్టు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరో నలుగురుని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అరెస్టు చేసింది.

Updated : 29 May 2023 21:59 IST

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరో నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అరెస్టు చేసింది. వరంగల్ విద్యుత్ శాఖ డివిజినల్‌ ఇంజినీర్‌ (డీఈ) రమేష్‌తో పాటు ప్రశాంత్, మహేష్, నవీన్‌ అరెస్టు అయిన వారిలో ఉన్నారు. ఏఈఈ, డీఏఓ పరీక్షకు సంబంధించిన 25 ప్రశ్నపత్రాలను డీఈ రమేష్ విక్రయించినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా డీఈ రమేష్‌ సమాధానాలు అందించినట్లు తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని