Gun fire: ఇరువర్గాల కాల్పులు.. క్షణికావేశానికి నాలుగు ప్రాణాలు బలి

శత్రుత్వం పెంచుకున్న ఇరువర్గాలు తుపాకీలతో పరస్పరం కాల్పులు జరపడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Published : 08 Jul 2024 17:43 IST

గురుదాస్‌పుర్‌: పంజాబ్‌లోని (Punjab) గురుదాస్‌పుర్‌లో (Gurudaspur) దారుణం చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీసింది. పరస్పరం తుపాకులతో దాడులకు దిగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఒక్కో వర్గం నుంచి ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ ఘటన రాజకీయంగా అగ్గిరాజేస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో అధికార ఆమ్ ఆద్మీ విఫలమైందంటూ భాజపా విరుచుకుపడుతోంది. ఆప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు ఎక్కువయ్యాయని భాజపా నేత సిర్సా ఆరోపించారు. సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌ చర్యలు తీసుకునే సరికి ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని