Hyderabad: జీవిత బీమా పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం

నగరంలో జీవిత బీమా పేరుతో భారీ మోసానికి పాల్పడిన ముగ్గురు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు

Published : 26 Mar 2022 02:07 IST

హైదరాబాద్‌: నగరంలో జీవిత బీమా పేరుతో భారీ మోసానికి పాల్పడిన ముగ్గురు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగి రామరాజును పలుమార్లు మాయమాటలు చెప్పి జీవిత బీమా చేసుకోవాలంటూ నిందితులు ఒత్తిడి చేశారు. ఈ మేరకు విడతల వారీగా రూ.3.50 కోట్లు చెల్లించి జీవిత బీమా తీసుకున్నారు. బీమాకు సంబంధించిన పత్రాలను అమెరికాలో ఉన్న తన కుమారుడు పరిశీలించగా.. అవి నకిలీవని తేలడంతో వారు నిర్ఘాంతపోయారు. మోసపోయామని తెలుసుకున్న బాధితుడు వెంటనే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే కేసును ఛేదించారు. నిందితులు కరీంనగర్‌కు చెందిన మనోజ్, వనపర్తికి చెందిన మహేశ్‌ గౌడ్, గుడివాడకు చెందిన సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పని చేస్తున్న కంపెనీకే టోకరా..

పనిచేస్తున్న కంపెనీకే ఓ ఉద్యోగి రూ.2.06 కోట్ల మేర టోకరా వేసిన మరో ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కంపెనీకి చెందిన ఇతర ఉద్యోగుల పేరుతో నకిలీ ఐడీలు, పాస్‌వర్డ్‌లను సృష్టించి రూ.2.06 కోట్లు కాజేశాడు. తార్నాకలోని కంపెనీ యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని