Hyderabad: టెన్త్ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్!
నగర శివారు హయత్‌నగర్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
హయత్‌నగర్: హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై ఐదుగురు తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్ట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు అత్యాచారాన్ని వీడియో తీసి తోటి విద్యార్థులకు పంపించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బాలికను బెదిరించారు. అనంతరం 10 రోజుల తర్వాత మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు.
అయితే అప్పటి వీడియోను నిందితులు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బాధితురాలి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులంతా మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోమ్‌కి తరలించే అవకాశముంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Panaji: 10ఏళ్ల బాలుడి సాహసం.. నీటిలో మునుగుతున్న స్నేహితులను కాపాడి..
-
Politics News
MP Laxman: కేసీఆర్ కుటుంబ కలలు కల్లలుగానే మిగిలిపోతాయ్: ఎంపీ లక్ష్మణ్
-
Politics News
Modi - Rahul: కాంగ్రెస్ ర్యాలీ వాయిదా..ఒకేరోజు మోదీ, రాహుల్ మీటింగ్స్
-
Politics News
CM KCR: నా రాజకీయ జీవితమంతా పోరాటాలే: సీఎం కేసీఆర్
-
Politics News
Andhra News: రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స