Vijayawada: బెజవాడలో బ్లేడ్ బ్యాచ్‌ల మధ్య గ్యాంగ్ వార్.. బెంబేలెత్తిన జనం
విజయవాడలో గంజాయి సేవించే రెండు బ్లేడ్ బ్యాచ్‌ల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.
విజయవాడ: నగరంలోని టూటౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవించే రెండు బ్లేడ్ బ్యాచ్‌ల మధ్య గ్యాంగ్ వార్ తలెత్తింది. గురువారం రాత్రి గని అనే బ్లేడ్ బ్యాచ్ సభ్యుడికి, ఆంజనేయ వాగు సమీపంలో ఉండే సాంబా అనే యువకుడికి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉండి వీరంగం వేస్తున్న గని బ్యాచ్ సభ్యుడిని పట్టుకొని హరి బ్యాచ్ సభ్యులు పోలీసులకు అప్పగించారు. పోలీసులకు అప్పగించారనే కక్ష పెంచుకొని హరి బ్యాచ్ సభ్యులపై గని బ్యాచ్ దాడికి పాల్పడింది. ఆంజనేయ వాగు సెంటర్ కొండ ప్రాంతంలో గని బ్యాచ్ సభ్యుడైన అఖిల్ మరో ఆరుగురు యువకులతో కలిసి శుక్రవారం అక్కడికి చేరుకుని బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అఖిల్, శ్రీను తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాంగ్ వార్ బహిరంగంగా జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్‌సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
గంజాయి మిల్క్‌షేక్!
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్‌ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్‌నాగ్‌లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్‌నాగ్ జిల్లాలో బిహార్‌కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!