Crime News: మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి ముఠా వీరంగం

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి ముఠా వీరంగం సృష్టించింది.

Updated : 24 Jun 2024 10:48 IST

మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి ముఠా వీరంగం సృష్టించింది. సెలూన్‌ షాప్‌లో షేవింగ్‌ చేసిన తర్వాత డబ్బులు అడిగిన నిర్వాహకుడిపై ఆ గ్యాంగ్ దాడికి పాల్పడింది. తమనే డబ్బు అడుగుతావా? అంటూ అతడిపై ముగ్గురు వ్యక్తులు విరుచుపడ్డారు. అనంతరం ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన స్థానికులపైనా దాడికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈలోపే గంజాయి ముఠా అక్కడి నుంచి పరారైంది. గంజాయి మత్తులో తమపైనా దాడి చేస్తున్నారని కాలనీ వాసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని