కెనడాలో చదివి..గంజాయికి బానిసై..
కెనడాలో ఉన్నత చదువులు చదివిన ఓ యువకుడు మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించాడు.
హైదరాబాద్: కెనడాలో ఉన్నత చదువులు చదివిన ఓ యువకుడు మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. గంజాయికి బానిసై ఉద్యోగాన్ని కోల్పోయాడు. చివరికి డెలివరీ బాయ్‌గా మారి గంజాయి విక్రయిస్తూ ఆబ్కారీ పోలీసులకు పట్టుబడ్డాడు.
పోలీసుల కథనం ప్రకారం... సికింద్రాబాద్ కవాడీగూడకు చెందిన బాలాజీసింగ్ కెనడాలో ఎం.ఎస్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో ఫేస్బుక్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత మత్తు పదార్థాలకు అలవాటుపడి ఉద్యోగం కోల్పోయాడు. దీంతో ఉపాధి కోసం డెలివరీ బాయ్‌గా మారాడు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో చేరి.. డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ దూల్పేటలో గంజాయి విక్రేతలతో పరిచయం పెంచుకున్నాడు. వాళ్లు ఇచ్చే గంజాయిని గచ్చిబౌలిలోని కొందరు ఐటీ ఉద్యోగులు, మాదాపూర్‌లోని హాస్టల్ విద్యార్థులకు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో అతడే విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించడం మొదలుపెట్టాడు. ఈక్రమంలో నాలుగు రోజుల క్రితం విశాఖపట్నం వెళ్లిన బాలాజీ సింగ్ గంజాయితో పాటు మత్తు ద్రావణాన్ని నగరానికి తీసుకొచ్చాడు. వాటిని ప్యాకెట్ల లో నింపి అవసరమైన వారికి సరఫరా చేస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు బాలాజీసింగ్‌ను అరెస్టు చేశారు. అతనివద్ద నుంచి 800 గ్రాముల మత్తు ద్రావణంతో పాటు, కిలో గంజాయి, ద్విచక్రవాహనం, చరవాణి స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్‌లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్‌ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్