ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

పెన్నానదిలో సరదాగా ఈతకు వెళ్లి నలుగురు కుటుంబసభ్యులు మృత్యువాత పడిన సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని రాయచూర్‌ ప్రాంతానికి చెందిన ముంతాజ్‌ తన పిల్లలతో కలిసి కడపలోని ప్రకాశ్‌నగర్‌లో...

Published : 03 Jan 2020 00:52 IST

సిద్ధవటం: పెన్నానదిలో సరదాగా ఈతకు వెళ్లి నలుగురు కుటుంబసభ్యులు మృత్యువాత పడిన సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని రాయచూర్‌ ప్రాంతానికి చెందిన ముంతాజ్‌ తన పిల్లలతో కలిసి కడపలోని ప్రకాశ్‌నగర్‌లో ఉన్న తన సోదరుడు అన్వర్‌ ఇంటికి వచ్చింది. కర్ణాటకలో పాఠశాలలకు సెలవులు కావడంతో పదేళ్లలోపు వయసున్న మదియా, పరియాతో పాటు జోహాన్‌ను తీసుకుని కడప వచ్చారు. సిద్ధవటం వద్ద పెన్నానదిని చూసేందుకు ముగ్గురు చిన్నారులతో పాటు మామ అన్వర్‌ వెళ్లారు. సాయంత్రం నదిలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు చిన్నారులతో పాటు మామ అన్వర్‌ నీటిలో మునిగి మృతిచెందారు. తొలుత మదియా, పరియా నదిలో మునిగిపోగా.. వారిని కాపాడేందుకు జోహాన్‌ వెళ్లి ఆమె కూడా చనిపోయింది. వారిని రక్షించేందుకు వెళ్లిన అన్వర్‌ కూడా నదిలో మునిగిపోయారు. ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు