Published : 05 Jan 2020 01:29 IST

విమానం ఆలస్యం.. సిబ్బందికి చేదు అనుభవం

దిల్లీ: ఎయిర్‌ఇండియా విమాన సిబ్బందికి గురువారం చేదు అనుభవం ఎదురైంది. ఏఐ865 విమానం సాంకేతిక కారణాలతో ఆలస్యమవడంతో ప్రయాణికులు సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించి, వారిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఎయిర్‌ఇండియా సంస్థ దీనిపై విచారణ చేసి సిబ్బందిని నివేదిక అందజేయాలని కోరింది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఏఐ865 దిల్లీ- ముంబయి విమానం గురువారం సాంకేతిక కారణాలతో ఆలస్యం అయింది. దీంతో అందులోని ప్రయాణికులు కాక్‌పిట్‌ తలుపును విరగ్గొట్టేందుకు ప్రయత్నించారు. పైలట్లను బయటకు రమ్మని గట్టిగా అరిచారు. అనంతరం ప్రయాణికుల్లో ఒక వ్యక్తి వారు బయటకు రాకపోతే తలుపు విరగ్గొడతానని పైలట్లను బెదిరించారు. మరో మహిళా ప్రయాణికురాలు వారిపై చేయి చేసుకున్నట్లు సిబ్బంది ఆరోపించారు. బయటకు వెళ్లే తలుపును సైతం బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించారు’ అని పేర్కొంది.

దీనిపై సంస్థ ప్రతినిధి ధనంజయ కుమార్‌ మాట్లాడుతూ.. ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందజేయమని సిబ్బందిని కోరినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా ప్రయాణికులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా దీనిపై విమానయాన డైరక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) సైతం అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికులపై చర్యలు తీసుకోవాలని సంస్థకు సూచించింది. 

 


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని