రెండు బస్సులు ఢీ: ఇద్దరు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై కాశిపెంట్ల ‌సమీపంలో బుధవారం వేకువజామున ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి.

Updated : 08 Jan 2020 11:20 IST

15 మందికి గాయాలు

చంద్రగిరి: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై కాశిపెంట్ల ‌సమీపంలో బుధవారం వేకువజామున ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు సహాయకుడు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం... మంగళవారం రాత్రి 8 గంటలకు విజయవాడ నుంచి చిత్తూరు జిల్లా కుప్పంకు అమరావతి వోల్వో బస్సు బయలుదేరింది. శబరిమల నుంచి నల్గొండకు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురుగా వస్తున్న  వోల్వో బస్సును ఢీకొట్టింది. రెండు బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ రమేశ్‌, అతని సహాయకుడు ఉయ్యూరుకు చెందిన ప్రసాద్‌ మృతి చెందారు. ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో, లారీలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

విచారణకు ఆదేశించిన మంత్రి

చిత్తూరు జిల్లాలో బస్సు ప్రమాద ఘటనపై ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని విచారణకు ఆదేశించారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న మంత్రి..బాధితులకు సత్వరమే వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని