దావూద్‌ మాజీ అనుచరుడి అరెస్ట్

పలు దోపిడీ, హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇజాజ్ లక్డావాలా అనే గ్యాంగ్‌స్టర్‌ను ముంబయి పోలీసులు బిహార్‌ రాజధాని పట్నాలో అరెస్టు చేశారు. గతంలో ఇతను అండర్‌ వరల్డ్‌ డాన్లు దావూద్...

Published : 10 Jan 2020 01:11 IST

ముంబయి: పలు దోపిడీ, హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇజాజ్ లక్డావాలా అనే గ్యాంగ్‌స్టర్‌ను ముంబయి పోలీసులు బిహార్‌ రాజధాని పట్నాలో అరెస్టు చేశారు. గతంలో ఇతను అండర్‌ వరల్డ్‌ డాన్లు దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్‌ల ముఠాల్లో పనిచేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ఇజాజ్‌ మొత్తం 27 కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. ఇతనిపై హత్యాయత్నం, దోపిడీ, దొమ్మీ వంటి పలు కేసులు నమోదయ్యాయి. 20 ఏళ్లుగా ఇజాజ్‌ పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్నాడు. గతంలోనే ఇతనిపై ఇంటర్‌పోల్  రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. ఇజాజ్‌ నకిలీ ధృవ పత్రాలతో మలేషియా, అమెరికా, నేపాల్, కెనడా దేశాలలో నివసించినట్లు పోలీసులు వెల్లడించారు. గత ఏడాది డిసెంబరు 28న నకిలీ ధృవ పత్రాలతో దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఇజాజ్‌ కుమార్తె సోనియాను పోలీసులు ముంబయి విమానాశ్రయంలో అరెస్టు చేశారు. తాజాగా ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడు పట్నా వస్తున్నట్లుగా తెలసుకొని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుణ్ని ముంబయి కోర్టులో ప్రవేశపెట్టి జనవరి 21 వరకు కస్టడీకి కోరనున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు