ఏసీబీకి చిక్కిన జూబ్లీహిల్స్‌ అడ్మిన్‌ ఎస్సై

నగరంలోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అడ్మిన్‌ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధీర్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఓ సివిల్‌ కేసు సంబంధించిన సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో రూ.50వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు...

Published : 10 Jan 2020 01:12 IST

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అడ్మిన్‌ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధీర్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఓ సివిల్‌ కేసు సంబంధించిన సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో రూ.50వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. లంచం ఇచ్చిన వ్యక్తి ముందుగానే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వలపన్ని సుధీర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లోనే ఏసీబీ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తు్న్నారు. గతంలోనూ ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. 2014కు బ్యాచ్‌కు చెందిన సుధీర్‌రెడ్డి గత ఏడాది ఆగస్టులో జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అడ్మిన్‌ ఎస్సైగా విధుల్లో చేరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని