Published : 12/01/2020 09:11 IST

అసలు ఏం జరిగింది?

లైంగికదాడి ఘటనలో మోడల్‌ను విచారించిన పోలీసులు

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తనపై లైంగిక దాడి జరిగిందని ఓ మోడల్‌ (21) ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ కె.ఎస్‌.రావు ఆధ్వర్యంలో యువతిని శనివారం విచారించి వివరాలు సేకరించారు. ఆమె కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడలో తాను ఉన్న హాస్టల్‌ యజమాని కుమారుడు, ఆమె కలిసి టిక్‌టాక్‌ వీడియోలు చేశారు. వీరిద్దరితో పాటు నిఖిల్‌రెడ్డి స్నేహంగా ఉండేవారు. డిసెంబరు 28న ఆమెకు మత్తు మందు కలిపిన మిఠాయి ఇచ్చారు. ఒక నిందితుడు (17) అత్యాచారం చేయగా, మరో నిందితుడు నిఖిల్‌రెడ్డి (19) చరవాణిలో తీశాడు. తాను చనిపోతానంటూ ఆమె చెప్పడంతో వారు 100కు ఫోన్‌ చేశారు. పోలీసులకు అసలు విషయం చెబితే సామాజిక మాధ్యమాల్లో వీడియో పెడతామంటూ బెదిరించారు. రాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురిని పోలీసులు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ యువతికి భోజనం పెట్టించారు. తాను, హాస్టల్‌ యజమాని కుమారుడు ప్రేమించుకుంటున్నామని.. ఇద్దరం ఒంటరిగా గడిపామని, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడంటూ ఆ రోజు రాత్రి రాసిన ఓ ఫిర్యాదుపై ఆమె సంతకం పెట్టింది. తాను మత్తులో ఉండటం వల్ల సంతకం పెట్టానని, ఆ ఫిర్యాదుతో తనకు సంబంధం లేదని తాజాగా ఆమె తెలిపింది. అత్యాచారంపై తాను ఈ నెల 7న మరో ఫిర్యాదు చేశానని ఏసీపీకి వివరించింది. నిందితులను కఠినంగా కోరింది. బాధితురాలికి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి భరోసా కేంద్రానికి పంపించినట్లు ఏసీపీ తెలిపారు. మరోవైపు ఓ యువతి, యువకుడు మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం చర్చనీయాంశంగా మారింది.

డబ్బులు డిమాండ్‌ చేశారు: నిందితుడి తల్లి
తన కుమారుడికి మోడల్‌ వల వేసిందని.. తప్పుడు కేసు పెట్టి రూ. 20 లక్షలు డిమాండ్‌ చేస్తోందని నిందితుడైన యువకుడి తల్లి, హాస్టల్‌ యజమాని ఆదిలక్ష్మి ఆరోపించారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తమ హాస్టల్‌లో ఉంటున్న సమయంలో మద్యం తాగి రావడంతో ఆమెను బయటికి పంపినట్లు తెలిపారు. తన కుమారుడితో పెళ్లికి సిద్ధపడిందని, అతడు మైనర్‌ కావడం వల్ల మరో రెండు సంవత్సరాలు ఆగాలని చెప్పామని.. ఆమె తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేస్తామని చెప్పామన్నారు. ఆమె తల్లిదండ్రులు సైతం రూ. 10 లక్షలు ఇవ్వాలని చెప్పారన్నారు. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. నిఖిల్‌రెడ్డి తల్లి సునీత మాట్లాడుతూ ఈ ఘటనతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అనవసరంగా తన కుమారుడిని లాగుతున్నారని పేర్కొంది.

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: ఏసీపీ
ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ కె.ఎస్‌.రావు పేర్కొన్నారు. ముగ్గురి మధ్య ఉన్న సంబంధం, జరిగిన ఘటనపై ఆధారాలను సేకరిస్తున్నామన్నారు. నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. నిందితుల తరఫున ఫిర్యాదులు అందితే వాటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని