ప్రపంచంలోకెల్లా కూల్‌ గై....వీడియో వైరల్‌

చోరీకి వచ్చిన దొంగే భయపడి పరుగు లంకించుకున్నాడు...

Published : 16 Jan 2020 16:37 IST

షాప్‌కి వచ్చి గన్‌ చూపిస్తే... సీన్‌ రివర్స్‌ ...వీడియో వైరల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన దుకాణంలో దొంగ చొరబడటం అనేది ఏ యజమానికైనా భయం కలిగించేదే.. అయితే ఇక్కడ మాత్రం చోరీకి వచ్చిన దొంగే భయపడి పరుగు లంకించుకున్నాడు.  మనదేశంలోనే జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆ యజమాని బంధువు ఒకరు ట్విట్టర్‌లో పెట్టారు. తన కజిన్ ప్రపంచంలోకెల్లా కామ్‌ అని కూడా ఆ యజమానిని పొగిడేశాడు. ఇక ఆ వీడియోలో ఏముందంటే... ఒక షాపులోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. అతన్ని యజమాని మర్యాదగా పలకరించాడు. కానీ ఆ వ్యక్తి తుపాకీ బయటకు తీసి మొత్తం డబ్బు అక్కడ పెట్టమన్నాడు. దానికి ఆ యజమాని నదురు బెదురు లేకుండా ఇంకేమైనా కావాలా అని అడిగాడు. అందుకా వ్యక్తి తనకి డబ్బే కావాలని గద్దించాడు. ఇక మరుక్షణంలోనే దుకాణం యజమాని తాపీగా కౌంటర్‌ క్రింది నుంచి ఒక ఇనుప రాడ్‌ను బయటకు తీసి ఆ దొంగ వెంట పడ్డాడు. సీన్‌ రివర్స్‌ కావటంతో చేసేదేం లేక ఆ దొంగ పలాయనం చిత్తగించడం చూసిన వారి పొట్ట చెక్కలవుతోంది. ఇక ఈ వీడియో నెటిజన్లను ఎంతగా ఆకట్టుకుందంటే ఒక్కరోజులోనే లక్షా యాభై వేల మంది లైక్‌ చేశారు... రెండు లక్షల మంది చూసేశారు...ఇంకా చూస్తున్నారు...  మీరూ చూసేయండి!

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు