
అదృశ్యమైన ముంబయి పేలుళ్ల సూత్రధారి అరెస్ట్
కాన్పూర్: పెరోల్‌పై ఉండి కనిపించకుండా పోయిన ముంబయి పేలుళ్ల సూత్రధారి జలీస్ అన్సారీని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కాన్పూర్‌లోని ఓ మసీదు నుంచి బయటకు వస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. అన్సారీని లఖ్‌నవూ తరలించినట్లు తెలిపారు. ‘డాక్టర్ బాంబ్’గా పేరున్న వైద్యుడు అన్సారీ ముంబయి నగరంలోని మొమిన్‌పురా ప్రాంతంలోని తన నివాసం నుంచి గురువారం కనపడకుండా పోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ముంబయిలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
1992లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక విధ్వంసకర ఘటనలు జరిగాయి. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా 1993 డిసెంబర్ 6న ముంబయి, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 43 వరుస బాంబు పేలుళ్లు, ఏడు రైళ్లలో కూడా పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ కుట్ర రచన, అమలులో అన్సారీ ముఖ్యపాత్ర పోషించినట్లు రుజువైంది. దీంతో అతడికి జీవిత ఖైదు పడింది. ఈ కేసులో జీవితఖైదును అనుభవిస్తుస్తున్న 68 ఏళ్ల అన్సారీని ఇటీవలే ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. నెల క్రితం పెరోల్‌పై విడుదలైన అతడు ఈ నెల 17న ఉదయం 11 గంటలకల్లా జైలు వద్ద హాజరు కావాల్సి ఉండగా అదృశ్యమయ్యాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.