రూపాయి విలువ చేసే చాక్లెట్లు దొంగిలించాడని..

బెంగళూరులో దారుణం జరిగింది. రెండు చాక్లెట్లు దొంగిలించినందుకు ఓ బాలుడి జుట్టు, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు ఓ సూపర్‌ మార్కెట్‌ యజమాని కత్తిరించాడు...........

Published : 20 Jan 2020 00:53 IST

బెంగళూరు: బెంగళూరులో దారుణం జరిగింది. రెండు చాక్లెట్లు దొంగిలించినందుకు ఓ బాలుడి జుట్టు, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు ఓ సూపర్‌ మార్కెట్‌ యజమాని కత్తిరించాడు. ఎలహంక కుత్తెనహళ్లిలో ఓ వ్యాపారి గల్లీమార్ట్‌ అనే దుకాణాన్ని నడుపుతున్నాడు. ఒక రూపాయి విలువచేసే రెండు చాక్లెట్లు దొంగిలించాడని 15 ఏళ్ల బాలుణ్ని ఆ దుకాణ యజమాని బంధించాడు. సిబ్బంది సాయంతో కాళ్లుచేతులు కట్టేసి మరీ జుట్టు, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు కత్తిరించాడు. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు వద్దంటూ ప్రాధేయపడ్డాడు. అయినా కనికరించని సిబ్బంది అమానవీయ చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకొని రాక్షసానందం పొందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని