
మంగళూరు విమానాశ్రయంలో బాంబు
నిర్జన ప్రదేశంలో పేల్చిన నిపుణులు
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో సోమవారం బాంబు కనిపించడం కలకలం సృష్టించింది. టికెట్ కౌంటర్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి విడిచి వెళ్లిన ఓ ల్యాప్‌టాప్ బ్యాగులో కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్) సిబ్బంది దాన్ని గుర్తించారు.పేలుడు పదార్థాన్ని బాంబు నిర్వీర్యక దళం నిపుణులు విమానాశ్రయానికి 2 కిలోమీటర్ల దూరంలోని కెంజారు మైదానానికి తీసుకెళ్లి ఇసుక మూటల మధ్య ఉంచి పేల్చివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తలకు టోపీ పెట్టుకుని, నీలం రంగు పుస్తకాన్ని చేతిలో పట్టుకుని వచ్చిన ఓ వ్యక్తి ల్యాప్‌టాప్ బ్యాగును వదిలి వెళ్లాడని.. అతడు ఆటోలో విమానాశ్రయానికి వచ్చాడని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.