Updated : 24 Jan 2020 01:05 IST

ఎన్‌ఐఏ కస్టడీకి దవీందర్‌ సింగ్‌

జమ్మూ: ఉగ్రవాదులకు సాయం చేస్తూ దొరికిపోయిన జమ్మూకశ్మీర్‌ డీఎస్పీ దవీందర్‌ సహా నలుగురిని ప్రత్యేక న్యాయస్థానం ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించింది. 15 రోజుల కస్టడీకి అనుమతించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సస్పెండైన డీఎస్పీతో పాటు ఇద్దరు ఉగ్రవాదులు, మరో ఇద్దరు అనుచరులను గురువారం ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ నిమిత్తం 15 రోజుల కస్టడీకి ఎన్‌ఐఏ అనుమతి కోరగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించింది. అంతకుముందు నిందితులను బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో కోర్టుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులతో న్యాయస్థాన ప్రాంగణం నిండిపోయింది.

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను తన కారులో ఎక్కించుకుని వెళ్తున్న దవీందర్‌ సింగ్‌ను గతవారం జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. అనంతరం కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. అయితే దవీందర్‌ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పుల్వామా డీఎస్పీగా దవీందర్‌ ఉన్నప్పుడే అక్కడ దాడి జరిగిందని, దీనిపై ఆయనను నోరు మెదపకుండా చేసేందుకే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారని ఆరోపించింది.

ఇదీ చదవండి..
ఎవరీ దవీందర్‌ సింగ్‌..?​​​​​​

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని