ఆ బాలిక చెప్పిందంతా కట్టుకథే: ఎస్పీ

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగిన అత్యాచార ఆరోపణలపై నమోదైన కేసు కొలిక్కి వచ్చింది. బాలిక చెప్పిందంతా ఓ కట్టుకథగా ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి నిర్ధరించారు. ఒక యువకుడు బాలికను ద్విచక్రవాహనంపై

Published : 25 Jan 2020 00:36 IST

అమీన్‌పూర్‌: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో అత్యాచార ఆరోపణలపై నమోదైన కేసు కొలిక్కి వచ్చింది. బాలిక చెప్పిందంతా ఓ కట్టుకథగా ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి నిర్ధరించారు. ఒక యువకుడు బాలికను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడని చెప్పారు. సినిమాకు వెళ్లినట్లు తెలిస్తే తల్లి తిడుతుందని భావించిన బాలిక అబద్ధం చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. బాలిక ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసినందుకు ఇంటి యజమానిపై కేసు నమోదు చేశారు. మైనర్‌ను తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకెళ్లినందుకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

అంతకు ముందు గురువారం ఉదయం దుకాణానికి అని చెప్పి బాలిక బయటకు వెళ్లింది. మధ్యాహ్నం గం.2:30 ప్రాంతంలో తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఎవరో ద్విచక్రవాహనంపై వచ్చి తనను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అమీన్‌పూర్‌ ఇన్‌స్పెక్టర్‌ వివరాలు సేకరించి బాలికను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా, బాలికపై అత్యాచారం జరగలేదని తేల్చారు. దీంతో కంగారు పడ్డ బాలిక అత్యాచారం చేయలేదు.. ప్రయత్నించారని మాట మార్చింది. బాలిక తీరు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు విచారణ జరిపి పై విషయాలు వెల్లడించారు.

ఇదీ చదవండి..

బాలికను బెదిరించి అత్యాచారయత్నం!

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని