జేఎన్‌యూ మాజీ విద్యార్థిపై కేసు

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి, సీఏఏకి వ్యతిరేకంగా దిల్లీ షాహిన్‌భాగ్‌లో ఆందోళనలకు నేతృత్వం వహిస్తు్న్న వారిలో ఒకరైన షార్జిల్‌ ఇమామ్‌పై దిల్లీ పోలీసులు....

Updated : 27 Jan 2020 02:15 IST

దిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి, సీఏఏకి వ్యతిరేకంగా దిల్లీ షహిన్‌భాగ్‌లో ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న వారిలో ఒకరైన షార్జిల్‌ ఇమామ్‌పై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, ప్రతిపాదిత ఎన్‌ఆర్‌సీపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్‌ 13న జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా  రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మతరపరమైన అల్లర్లకు, దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కారణమవుతాయన్న కారణంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అతను మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఓ ఆడియో క్లిప్‌ వైరల్‌గా మారింది. దేశం నుంచి అసోంను  తొలగించాలని ఆ వీడియోలో ఉంది. తనకే గనుక ఐదు లక్షల మంది మద్దతు ఉంటే ఆ పనిచేస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడిపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 153ఏ, 505 కింద దిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే జనవరి 16న అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో చేసిన వ్యాఖ్యలపై అసోం పోలీసులు ఉగ్రవాద నిరోదక చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని