మావోయిస్టులపై గ్రామస్థుల దాడి

ఆంధ్ర-ఒడిశా (ఏవోబీ) సరిహద్దులోని ఓ గ్రామంలో యువకుడిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు మావోయిస్టులపై గ్రామస్థులు దాడి చేశారు.

Published : 27 Jan 2020 01:58 IST

ఒకరి మృతి.. విషమంగా మరొకరు

సీలేరు: ఆంధ్రా-ఒడిశా (ఏవోబీ) సరిహద్దులోని ఓ గ్రామంలో యువకుడిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు మావోయిస్టులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, మరో మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని చిత్రకొండ బ్లాక్‌ పరిధిలో ఉన్న జొడంబో పంచాయతీ జంతురాయి గ్రామానికి శనివారం అర్ధరాత్రి ముగ్గురు మావోయిస్టులు వచ్చారు. గ్రామానికి చెందిన ఓ యువకుడిని వారు తమతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది గుర్తించిన గ్రామస్థులు వారిని అడ్డగించారు. దీంతో గ్రామస్థులు, మావోయిస్టుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ తారస్థాయికి చేరడంతో గ్రామస్థులు మావోయిస్టులపై రాళ్లతో దాడికి దిగారు. ఒక మావోయిస్టు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఇంకో మావోయిస్టు పారిపోయాడు. మృతుడిని గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు హాద్మగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మావోయిస్టు నందిపూర్‌ ఏరియా కమిటీ సభ్యుడు జిపోను బీఎస్‌ఎఫ్‌‌ బలగాలు గుర్తించాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని